Anthropic AI: ఒక్క వార్తతో టెక్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రపంచ వ్యాప్తంగా టెక్ షేర్ మార్కెట్లు కుప్పకూలాయి. అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలైన ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఒక్కసారిగా దిగువకు పడిపోయాయి. భారీగా సంపద ఆవిరైపోయింది. ఇంతకీ ఏంటా వార్త? రాత్రికి రాత్రే ఏం జరిగింది? బుధవారం తెల్లవారుజామున టెక్కీలు నిద్రలో ఉండగానే జరిగిన పరిణామం ఏంటి? అనే విషయాల గురించి స్పష్టంగా తెలుసుకుందాం.. బుధవారం తెల్లవారుజామున, చాలా మంది నిద్రలో ఉండగానే ప్రపంచ టెక్ మార్కెట్లో ఒక్కసారిగా పెద్ద కుదుపు వచ్చింది. అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల విలువ పడిపోవడంతో వందల బిలియన్ల డాలర్ల మార్కెట్ విలువ ఆవిరైపోయింది. ఈ పరిస్థితిని విశ్లేషకులు భారీ హెచ్చరికగా తీసుకున్నారు. ఈ గడ్డుకాలాన్ని నిపుణులు “సాస్-అపోకలిప్స్” అని పిలిచారు. అంటే సాఫ్ట్వేర్ ఎస్ ఎ సర్వీస్ రంగానికి అంతమొచ్చిందా? అనే అర్థం. ఈ తరుణంలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల నుంచి జోహో అధినేత శ్రీధర్ వెంబు వరకు చాలామంది ఒకటే మాట చెబుతున్నారు. ఈ మార్కెట్ పతనం వాళ్ల మాటలు తేలికగా తీసుకోకూడదని గుర్తు చేశారు.
Click here to
Read more