AP Census: జనాభా లెక్కల సేకరణ-2027పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ గత జనాభా లెక్కల సేకరణ 2011లో జరిగిందని తదుపరి జనాభా లెక్కల సేకరణ వచ్చే ఏడాది ఫిబ్రవరి 9నుంచి 28 వరకూ జరగనుందని రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ జె.నివాస్ తెలిపారు.రానున్న జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుందని తెలిపారు. మొదటి దశ హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్(హెచ్ఎల్ఓ), రెండవ దశ పాపులేషన్ ఎన్యుమరేషన్ (పిఇ) జరుగుతుందని వెల్లడించారు. దేశంలో జనాభా లెక్కల సేకరణ నేపధ్యాన్ని వివరిస్తూ 2027లో నిర్వహించే జనాభా లెక్కల సేకరణ 16వది కాగా స్వాతంత్ర్యానంతరం నిర్వహించే 8వ జనాభా లెక్కల సేకరణ ఉంటుందని తెలిపారు.
Click here to
Read more