Bhumana Karunakar Reddy: వైసీపీ, మాజీ సీఎం జగన్ను నాశనం చేయాలని సీఎం చంద్రబాబు అనేక కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. దానికోసం ఇప్పటి దాక వ్యవస్థలను వాడుకున్నారు.. ఇప్పుడు వేంకటేశ్వర స్వామిని వాడుకుంటున్నారని విమర్శించారు. దొరికిపోయిన దొంగలు అనేలా చంద్రబాబు, పవన్, బీజేపీ నేత మాధవ్ ప్రెస్ మీట్ ఉందన్నారు. తప్పులు చేసినందుకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని జగన్ డిమాండ్ చేస్తే.. ఉలిక్కిపడి చంద్రబాబు ఈరోజు ముగ్గురు నేతలను తీసుకుని వచ్చారన్నారు. అవసరం అయితే గొడ్డు మాసం తింటాను అని పవన్ కళ్యాణ్ చాలా సార్లు చెప్పారని ఆరోపించారు.
Click here to
Read more