Maharashtra Elections: మహారాష్ట్ర రాజకీయాల్లో ఈసారి ఓ కొత్త గాలి వీసింది. ఇప్పటివరకు పెద్దగా లెక్కచేయని ఒక పార్టీ, ఇప్పుడు నగరాల్లో గట్టిగా తన ఉనికిని చాటింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఏఐఎంఐఎం పార్టీ, గాలిపటం గుర్తుతో పోటీ చేసి 2026 మున్సిపల్ ఎన్నికల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తర్వాత.. మహారాష్ట్రలోనూ తమది చిన్న పార్టీ కాదని నిరూపించుకుంది. అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలో ఈ పార్టీ మొత్తం 125 సీట్లు గెలుచుకుంది. ఔరంగాబాద్, మాలేగావ్, నాందేడ్, నాగ్‌పూర్, ముంబయి లాంటి ప్రధాన నగరాల్లో AIMIM బలంగా నిలిచింది. ఇది కేవలం సీట్లు మాత్రమే కాదు.. రాష్ట్ర రాజకీయాల లెక్కలనే మార్చేసింది. ఇదే పార్టీకి రెండు సంవత్సరాల క్రితం పరిస్థితి పూర్తిగా వేరేలా ఉండేది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఛత్రపతి సంభాజీనగర్ నుంచి ఉన్న ఏకైక ఎంపీ సయ్యద్ ఇమ్తియాజ్ జలీల్ ఓడిపోవడంతో లోక్‌సభలో AIMIM ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అదే ఏడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 16 చోట్ల పోటీ చేసి కేవలం మాలేగావ్ సెంట్రల్‌లో ఒక్క సీటే గెలిచింది. అప్పుడు చాలామంది ఇక్కడితో AIMIM కథ ముగిసిందనుకున్నారు.
Click here to
Read more