Natasa Stankovic New Car: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో విడాకుల అనంతరం నటాషా స్టాంకోవిచ్ తన జీవన శైలిని పూర్తిగా మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఒకప్పటి గ్లామర్ ఈవెంట్‌లకు, క్రికెట్ మ్యాచ్‌లకు తరచూ హాజరయ్యే నటాషా.. ఒంటరితనాన్ని ఎంచుకుట్లు తెలుస్తోంది. కానీ ఇప్పుడు మళ్లీ తనకిష్టమైన జీవితం వైపు తిరిగి అడుగులు వేస్తోంది. తనపై వస్తున్న వార్తలకు పెద్దగా స్పందించని నటాషా.. ఇప్పుడు వ్యక్తిగతంగా, ఆర్థికంగా స్థిరపడడానికి ప్రయత్నిస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. కుమారుడు అగస్త్యను చూసుకుంటూనే, తన కెరీర్ మీద కూడా దృష్టి పెడుతోంది. మధ్యలో ఆమె ఒక వ్యక్తితో డేటింగ్‌లో ఉన్నారన్న రూమర్లు వచ్చినా, ఆ వార్తలపై వాటికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. తన ప్రైవేట్ లైఫ్‌ను ఎవరితోనూ పంచుకోకుండా, మౌనంగా ముందుకు సాగిపోతోంది.
Click here to
Read more