CPI Maoist Party: మారేడుమల్లి ఎన్కౌంటర్‌పై సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అభయ్ పేరుతో ప్రెస్ నోట్ విడుదలైంది. నిరాయుధులైన మాడ్వి హిడ్మా రాజేల తోపాటు మరికొంతమందిని తీసుకొని వెళ్లి హత్య చేసి ఎన్కౌంటర్ గా చిత్రీకరించారని లేఖలో పేర్కొన్నారు. అలాగే రంపచోడవరంలో ఏవోబి రాష్ట్ర కార్యదర్శి శంకర్ తో పాటు మరికొంతమందిని హత్య చేసి ఎన్కౌంటర్ కట్టుకథ అల్లారని ఆరోపించారు. ఈ బూటకపు ఎన్కౌంటర్లను ఖండిస్తూ 23వ తేదీన దేశవ్యాప్తంగా నిరసన దినంగా పాటించాలని పిలుపు నిచ్చారు. బూటకపు ఎన్కౌంటర్లు అసువులు బాసిన కామ్రేడ్ల ఉద్యమ స్ఫూర్తిని నింపుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని శపథం చేస్తున్నామన్నారు.
Click here to
Read more