UP: ఉత్తరప్రదేశ్‌లో ఓ భయంకరమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. తనతో లివ్-ఇన్ రిలేషన్‌లో ఉన్న మహిళను హత్య చేసి తల నరికి, మృతదేహాన్ని అడవి ప్రాంతంలో పడేసిన కేసులో పోలీసులు ఓ ట్యాక్సీ డ్రైవర్‌ను అరెస్టు చేశారు. అనంతరం నిందితుడు మరో పెళ్లికి సిద్ధమవుతున్నాడని పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఉమా అనే 30 ఏళ్ల మహిళను ఆమె బాయ్‌ఫ్రెండ్ బిలాల్ అనే ట్యాక్సీ డ్రైవర్ హత్య చేశాడు. మరో మహిళను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఉమాతో ఉన్న సంబంధాన్ని ముగించాలనుకుని ఈ నేరానికి పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. ఉమా తల లేని మృతదేహం హర్యానాలోని కలేసర్ నేషనల్ పార్క్ సమీపంలో లభ్యమైంది. దీంతో రెండు రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు కారణమైన నిందితుడిని ఆదివారం పట్టుకున్నారు.
Click here to
Read more